బాలికలకు అవగాహన సదస్సు

23-11-2026 | 08:40pm

నిర్మల్ నవంబర్ 23 (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహం ప్రియదర్శిని నగర్ నిర్మల్(Nirmal)లో బేటి బచావో బేటి పడావో పథకం గురించి అవగాహన నిర్వహించారు.

ఈ  జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి దయానంద్ సార్ గారి సమక్షంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది బేటి బచావో బేటి పడావో అంశాలను అలాగే బాలికల సాధికారత బాల్యవివాహాలు, బాల్య వివాహాల చట్టం, గర్భస్థలింగ నిర్ధారణ చట్టం సైబర్ క్రైమ్, సఖి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత, అలాగే లింగ వివక్షత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఋతుక్రమ పరిశుభ్రత వంటి అంశాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు పల్లవి సౌమ్య, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది జెండర్ స్పెషలిస్ట్ లు జ్యోతి మౌనిక, భరోసా సిబ్బంది లీగల్ ఆఫీసర్ అర్చన, షీ టీం సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు