ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) అమలు తీరును తిరువూరు మండలం కాంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Collector Sneha Shabareesh) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం అమలుకు సంబంధించి చేపడుతున్న వివరాల సేకరణ, అర్హులైన కుటుంబాల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) ద్వారా అర్హులైన కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పథకం అమలులో భాగంగా గ్రామస్థాయిలో ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా సేకరించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.