రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సీ ఓఈ విద్యార్థులు
బెల్లంపల్లి : బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Telangana Social Welfare Gurukul School) సెంట్రల్ ఎక్స్లెన్సీ( సీ వో ఈ) విద్యార్థులు బోరీ కుంట్ల కౌశిక్ (ఎంపీసీ ద్వితీయ సంవత్సరం),జాడి సాయికిరణ్ (బైపిసి సాయికి ద్వితీయ) అండర్ 19 పాఠశాల క్రీడా సమైక్య పోటీలకు ఎంపికయ్యాయి. సీ వో ఈ ప్రిన్సిపల్ ఆకిడి విజయసాగర్, వైస్ ప్రిల్సిపాల్ తన్నీరు గోపి విద్యార్థులను అభినందించారు. జోనల్ సాయి హ్యాండ్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయిలో పోటీలకు ఎంపికయ్యారు.
ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 23 నుంచి 26 వరకు మహబూబ్నగర్లో హైస్కూల్లో జరుగుతాయని అండర్ 19 ఉమ్మడి అదిలాబాద్ ఎస్జీఎఫ్ సెక్రటరీ బి .బాబురావు తెలిపారు ఈ సందర్భంగా డిఐఈఓ మంచిర్యాల మదర్ గౌడ్ కాలేజీ క్రీడా సమైక్య లో విద్యార్థులు పోటీలలో పాల్గొని మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా జెడ్ ఓ శారద తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో రాణించి జాతీయ స్థాయిలో పాల్గొనాలని విద్యార్థులకు అక్షాకించారు. ఈ సందర్భంగా పాఠశాల కళాశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు పుష్ప గుచ్ఛమిచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చ కుర్తి రాజశేఖర్, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.