ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమం(Prajavani program)లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్(Collector Pratima Singh), అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని, సమస్యకు సంబంధించిన వివరాలను నిర్ధారించుకుని నిబంధనల మేరకు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఫిర్యాదుల పరిష్కారంలో అనవసర జాప్యం చేయకుండా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 69 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. అందులో భూ భారతి 26,ఇందిరమ్మ ఇండ్లు 07, పెన్షన్ 01, ఇతర 35 మొత్తం 69 అందాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.