ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
పెనుబల్లి అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్ కే రంజాన్ స్థానిక పిఎం జడ్పీహెచ్ఎస్ విఎం బంజరలోని డి వెంకటేశ్వరరావు ప్రాంగణం నందు టీఎస్ యుటిఎఫ్(TSUTF) పెనుబల్లి మండలం 13వ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే రంజాన్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు మరియు ఉపాధ్యాయులు పెరిగిన నిత్యావసర ధరలను భరించలేక సతమతం అవుతున్నారని వారికి వెంటనే 2023 జూలై 1 నుంచి బకాయిపడ్డ రెండవ పిఆర్సి ని విడుదల చేసి సాంత్వాన్ని కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను విడుదల చేసి పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన సిపిఎస్ రద్దు పరచాలని ఎనీపి 20 20 రద్దు చేయాలని కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం బెస్ట్ వర్తింపజేయాలని గురుకుల పాఠశాల టైమింగ్స్ ను సవరించాలని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్నికల అధికారి కే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షునిగా జి వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా కె శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎన్ అరుణ, కే రంగబాబు, కోశాధికారిగా కె నాగేశ్వరరావు, ఆడిటర్ గా ఎన్ హెచ్ ప్రసాద్, కార్య దర్శులుగా సిహెచ్ శ్రీలత P.L అజయ్, టీ మురళీకృష్ణ, జీ హనుమంతు, R వీరభద్రరావు ,S.K దావూద్ పాషా,L.బి. వాసుదేవ్,వై వెంకట్ రెడ్డి, ఎస్ రేణుక, జి రవికుమార్, బి రాము, ఎం రాము, టి రమేష్ మొదలగువారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ కార్యదర్శి బండి నరసింహారావు జిల్లా పూర్వ కార్యదర్శి ఎం నరసింహారావు మండల విద్యాశాఖ అధికారి కే మోహన్ రావు జిల్లా కార్యదర్శి వివి రామారావు మండల పూర్వ అధ్యక్షులుS. వెంకటేశ్వర్ రెడ్డి, నిర్మల కుమారి, ఉమామహేశ్వర్ రెడ్డి, కే విజయ్ కుమార్, షరీఫ్ మొదలగువారు పాల్గొన్నారు.