శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం
పాపన్నపేట: ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాపన్నపేట గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఆకాంక్షించారు. సోమవారం పాపన్నపేటలోని ప్రభుత్వ పాఠశాలలో(Pappannapet government schools) విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించే అల్పాహార కార్యక్రమాన్ని(Breakfast Program) ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు(Students) ఉదయం పూట పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండడంతో పాటు పాఠశాలలో చదువుపై మరింత ఏకాగ్రత సాధించగలుగుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విద్యాభ్యాసం(Education) భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాఠశాలల్లోనే ఉదయం పూట నాణ్యమైన అల్పాహారం అందించడం ద్వారా తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని తెలిపారు.
పాపన్నపేట మండల వ్యాప్తంగా ఒక జూనియర్ కళాశాల, 10 జడ్పీహెచ్ఎస్, 42 ప్రాథమికోన్నత, 8 ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం అల్పాహార పథకం ప్రారంభమైంది. విద్యార్థులకు ఇడ్లీ సాంబారు వడ్డీంచారు. మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి పొడ్చన్ పల్లి పాఠశాలలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఆయా గ్రామల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.