పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా వాల్మీకి జయంతి

26-10-2026 | 08:17pm

మహర్షి వాల్మీకి జీవితం, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు హేమచంద్రపురంలోని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నందు వాల్మీకి జయంతి(Valmiki Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, నీతి వంటి ఉన్నత విలువలను బోధిస్తుందని తెలిపారు. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచనలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బి ఇన్‌స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సుధాకర్, లాల్ బాబు, నరసింహారావు, కృష్ణారావు, ఎస్సైలు రవి, చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ హరీష్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మహర్షి వాల్మీకికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు