ఉద్యమకారులకు మొండిచేయి

26-10-2026 | 08:12pm

సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్న ఫోరమ్ నేతల ముందస్తు అరెస్ట్

చివ్వెంల,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు(Telangana Activists) ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటి ముట్టడికి(CM House Protest) వెళ్తున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధు, రాష్ట్ర నాయకుడు భాషిపంగు సునీల్‌ను చివ్వెంల ఎస్‌ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా అనంతుల మధు మాట్లాడుతూ.. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, పేదరికం ప్రాతిపదికన ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చినా కేకే కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తొలి, మలిదశ ఉద్యమకారులు వృద్ధాప్య, ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు