రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మహిళా క్రీడాకారులు...

26-10-2026 | 08:07pm

తాడ్వాయి (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు 14 మంది మహిళ క్రీడాకారులు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజన్న(Kabaddi Association District General Secretary CH Rajanna) తెలిపారు. 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ క్యాంప్ క్రీడలు పూర్తిచేసుకుని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి సోమవారం బయలుదేరి వెళ్ళారని ఆయన తెలిపారు.రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన వారిలో ఉష, రిషిక, సుస్మిత, కృష్ణవేణి, శ్రీహిత, నవ్య శ్రీ, విద్యశ్రీ,  సుచరిత, నిషిత,అస్మిత, ఆరాధ్య, అశ్విత, హారిక, నిహులి తదితరులు ఎంపికయ్యారున్నారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి జగదీశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నగేష్,ఈసీ సభ్యులు నాగరాజు, ప్రభు,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు