నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

06-10-2026 | 09:52pm

నర్సింగి /చేగుంట అక్టోబర్ 06విజయక్రాంతి : నార్సింగి  మండల పరిధిలోని(Narsingi Mandal limits) పెద్ద తండా కు చెందిన మాలోత్ నవీన్ (23), మంగళవారం  గొర్రెలను మేపుకుంటూ మధ్యాహ్నం ఖాసులాపూర్ పరిధిలోని లింగారెడ్డి కుంట వద్దకు చేరుకున్నాడు. గొర్రెలను కుంటలో కడిగే క్రమంలో ప్రమాదవశాత్తు నవీన్ నీటిలో మునిగి మృతి చెందాడు.

నవీన్ మృతితో పెద్ద తండా లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఏఎస్ఐ ఖాజా మిస్బాహ్ ఉద్దీన్ తెలిపారు.

మరిన్ని వార్తలు