ఘనంగా స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న వర్ధంతి వేడుకలు...

06-10-2026 | 09:44pm

బాన్సువాడ, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న వర్ధంతినీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వడ్డెర సంఘం(Banswada's Vaddera Sangham) లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జాతీయ యువజన నాయకులు పిట్ల వేణుగోపాల్ పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో స్వాతంత్ర్య ఉద్యమ వీరుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు  మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్ ల సహకారంతో విగ్రహ ఏర్పాటు చేయనునట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు దేవా సాయన్న, మహిళలు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు