కిచెన్లలో కీటకాల రాజ్యం.. హోటళ్లపై దాడులు

06-11-2026 | 05:15pm

భద్రాద్రి కొత్తగూడెం: హోటళ్లలో రుచికరమైన భోజనం దొరుకుతుందని వెళ్తున్నారా? అయితే అక్కడి Kitchen పరిస్థితులు చూస్తే తినాలన్న ఆసక్తే పోవచ్చు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో Food Safety నిబంధనలు గాలికొదిలేసినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. వంట గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు కనిపించడంతో పాటు, తయారీ తేదీలు లేని ఆహార పదార్థాలను కూడా గుర్తించడం కలకలం రేపింది.

తెలంగాణ ఆహార, ఔషధ నాణ్యతా ప్రమాణాల సంస్థ (TG SAFE)కు చెందిన Food Safety, Enforcement అధికారులు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కిచెన్లలో పరిశుభ్రత పూర్తిగా లోపించినట్లు గుర్తించారు.

అధికారుల తనిఖీల్లో కొన్ని హోటళ్ల వంట గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తున్నట్లు బయటపడింది. ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానంలోనూ నిర్లక్ష్యం కనిపించింది. తయారీ తేదీలు (Manufacturing Dates) లేని ఆహార పదార్థాలు కూడా అధికారుల దృష్టికి వచ్చాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి Food Safety Rules ఉల్లంఘిస్తున్న తీరుపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన కొన్ని హోటళ్ల మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని హోటళ్ల యాజమాన్యాలకు Show Cause Notices అందజేశారు. ఆహార తయారీలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు Food Safety Standards పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు