కేసీఆర్ ను మళ్లీ సీఎంగా చూడాలి
నిర్మల్ నవంబర్ 6 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని అందుకే మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ను కోరుకుంటున్నారని రాష్ట్ర మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి(Former Minister Prashanth Reddy) అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. టిఆర్ఎస్ మాజీ చీఫ్ విప్ బాల్క సుమన్ బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సీనియర్ నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు.
పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మహిళలకు యువకులకు ఎంతో మేలు చేసిందని ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తుందన్నారు. కేసీఆర్ పథకాలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఉన్న పథకాలను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రశేఖర రావును చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీలో నేతలు వెళ్లిపోయిన కార్యకర్తలు బలంగా ఉన్నారని ఈ సత్తాను ఈనెల 11న రైతు గర్జనతో నిరూపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జాన్సన్ నాయక్, పడకండి రమాదేవి రామకృష్ణారెడ్డి కిరణ్ కారే ,శ్యాంసుందర్ మారుగొండ రాము అయ్యన్న గారి రాజేందర్ తదితరులు ఉన్నారు