రీ సర్వే పనులను వేగవంతం చేయాలి

06-11-2026 | 08:06pm

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

బెల్లంపల్లి: జిల్లాలో భూ సర్వే పనులను(Land survey work) వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్(District Additional Collector) (రెవెన్యూ) వి.రాములు అన్నారు. శుక్రవారం జిల్లాలోని కన్నెపల్లి మండలం శిక్నం గ్రామంలో ప్రారంభమైన రీ సర్వేలో(Re-survey) భాగంగా గ్రామ సరిహద్దుల నిర్ధారణ  పక్రియను మండల తహసీల్దార్‌తో(Mandal Tahsildar) కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియలో  చేపట్ట వలసిన పనులను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అనంతరం బెల్లంపల్లి మండలం టేకులబస్తీలో జి.ఓ. నెం.76 క్రింద చేపడుతున్న క్షేత్రస్థాయి విచారణ, సర్వే ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయి సర్వే పనులను వేగవంతం చేయాలని సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. బెల్లంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి జి.ఓ. నెం.76 అమలు పురోగతి, సాదాబైనామా దరఖాస్తులు, భూభారతి, ఎస్‌ఐఆర్ ప్రక్రియలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, జి.ఓ. నెం.76 క్రింద దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు