కేసీఆర్ భూముల సర్వేకు రంగం సిద్ధం
06-11-2026 | 03:10pm
సిద్దిపేట: భూభారతి (Bhu Bharati) సర్వేలో భాగంగా ఎర్రవల్లి రైతులకు నోటీసులు (Notices) జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన ఫామ్‌హౌస్ (Farmhouse) భూముల సర్వే చేపట్టేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మర్కూక్ తహశీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులను సిద్ధం చేశారు. త్వరలోనే రైతులకు నోటీసులు అందించే అవకాశం ఉంది. భూముల సర్వే (Land Survey) ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.