బాలయ్యకు సుమలత క్షమాపణలు

27-11-2026 | 07:04pm

హైదరాబాద్: టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం(Dancers' Union Controversy)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్ భార్య, డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత( Dancers Union President Sumalatha) గతంలో చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమలత మాట్లాడుతూ.. యూనియన్‌లో మొదలైన సమస్యలు ఫెడరేషన్ వరకు వెళ్లాయని, ఈ క్రమంలో జరిగిన పరిణామాలు బాధించాయని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, నిర్మాతల మండలి, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కు క్షమాపణలు చెప్పారు. బాలకృష్ణ వంటి సినీ పెద్దల గురించి తప్పుగా మాట్లాడటం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇకపై ఫెడరేషన్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

మరోసారి జరిగితే ఐదేళ్ల బ్యాన్!

తెలుగు చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా పరిష్కరించుకోవాలని సూచించారు. సుమలత ఇప్పటికే సంబంధిత సంస్థలకు క్షమాపణ లేఖలు అందించినట్లు వెల్లడించారు.

ఫిల్మ్ ఛాంబర్ లేదా దాని సభ్యులపై భవిష్యత్తులో దాడులకు పాల్పడితే ఐదేళ్ల పాటు సహాయనిరాకరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వివాదానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఇది పూర్తిగా డ్యాన్సర్స్ యూనియన్‌కు సంబంధించిన వ్యవహారమని స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్‌లో కొనసాగుతున్న ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు