రైతుల భూమి సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి రీసర్వే
హుజూర్ నగర్ తహశీల్దార్ హరిప్రసాద్
హుజూర్ నగర్,నవంబర్ 27: రైతుల భూములకు శాశ్వత హక్కులు(Permanent Rights) కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం (People's Government) ప్రతిష్టాత్మకంగా భూభారతి భూ రీ - సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని హుజూర్ నగర్ తహశీల్దార్ హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని లక్కవరం గ్రామంలో భూభారతి రీసర్వేను పరిశీలించి మాట్లాడారు.
దశాబ్దాల నాటి భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం భూభారతి రీసర్వే ప్రవేశపెట్టిందన్నారు మండల పరిధిలోని రైతులు భూ భారతి రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిపిఓలు వెంకటేశ్వర్లు, స్నేహలత,అలివేలు,పాండు రంగయ్య, సర్వేయర్ అనిల్,రైతులు, పాల్గొన్నారు.