వారికి కుర్చీలు ఇవ్వండి: సోనూసూద్

11-11-2026 | 02:42pm

విమానాశ్రయాలు, హోటళ్లలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం(Workers Health), సంక్షేమంపై బాలీవుడ్ నటుడు సోనూసూద్(Bollywood Actor Sonu Sood) కీలకంగా స్పందించారు. గంటల తరబడి నిలబడి విధులు నిర్వహించే సిబ్బందికి కూర్చుని విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పించాలని విమానాశ్రయ అధికారులు, హోటల్ యాజమాన్యాలకు(Hotel management) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

విమానాశ్రయాల్లోని చెక్‌ఇన్ కౌంటర్లు, హోటల్ రిసెప్షన్లు, సర్వీస్ డెస్క్‌లలో పనిచేసే ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిలబడే విధులు నిర్వహిస్తున్నారని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రయాణికులకు, అతిథులకు చిరునవ్వుతో సేవలందించే ఈ ఉద్యోగులు(Employees) ఎదుర్కొంటున్న శారీరక ఇబ్బందులను కూడా గుర్తించాలని సూచించారు.

పని ప్రదేశాల్లో ఎత్తైన స్టూల్స్ లేదా అనువైన కుర్చీలు ఏర్పాటు చేసి, అవసరమైనప్పుడు ఉద్యోగులు కూర్చునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే హాస్పిటాలిటీ రంగం లక్ష్యమైతే, ఆ సేవలందించే ఉద్యోగుల సౌకర్యం, ఆరోగ్యంపై కూడా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, వారి శారీరక శ్రమను తగ్గించేలా పని వాతావరణాన్ని మెరుగుపరచాలని సోనూసూద్ చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు