రామాయణకు పైరసీ.. సినిమా మొత్తం లీక్!
బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణతో దూసుకెళ్తున్న 'రామాయణ' (Ramayana Movie) సినిమాకు పైరసీ సమస్య ఎదురైంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్రబృందం తీవ్రంగా స్పందించింది. అనుమతి లేకుండా సినిమా దృశ్యాలను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజాగా చిత్రబృందానికి మరో షాక్ తగిలింది. సినిమా పూర్తి వెర్షన్‌ను కొందరు సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో 'రామాయణ' హిందీ వెర్షన్‌ను (Hindi Version) అప్‌లోడ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సినిమాలోని కీలక సన్నివేశాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండగా, ఇప్పుడు పూర్తి సినిమా లీక్ అవుతున్న వార్తలు చిత్రబృందాన్ని కలవరపెడుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి పైరసీ (Movie Piracy) కారణంగా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సినిమాను అక్రమంగా అప్‌లోడ్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం కాపీరైట్ చట్టాల (Copyright Act) ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై చిత్రబృందం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.