ముహూర్తం కుదిరింది!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Global Star Ram Charan), లెక్కల మాస్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్సీ 17’ ముహూర్తపు వేడుకకు సమయం ఆసన్నమైంది. నవంబర్ 1న ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇదిలా వుండగా, ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఇండస్ట్రీలో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. ఇటీవల ‘ధురంధర్’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలుస్తోంది.
రామ్‌చరణ్ సరసన సారా అర్జున్ నటించడం ఇదే తొలిసారి. సుకుమార్ మార్క్ క్యారెక్టరైజేషన్‌కు ఆమె సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావించినట్లు టాలీవుడ్ టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రారంభోత్సవానికి ముందే హైదరాబాద్‌లో నటీనటులపై ప్రత్యేక లుక్ టెస్ట్, ఫొటోషూట్ నిర్వహించినట్లు సమాచారం.
ముందుగా హీరోయిన్ సారా అర్జున్‌పై ఫొటోషూట్ పూర్తి కాగా, ఆ మరుసటి రోజే హీరో రామ్ చరణ్‌పై కూడా సరికొత్త మేకోవర్ కోసం లుక్ టెస్ట్ సెషన్స్ పూర్తి చేసినట్లు ఫిలింనగర్ టాక్. రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్‌లో సుకుమార్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తాని భోగట్టా. నవంబర్ 1న జరిగే పూజా కార్యక్రమాల అనంతరం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రబృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.