ట్రైలర్‌ టాక్‌ ఎలా ఉందంటే!

06-10-2026 | 05:11pm

హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) మరోసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్‌(Comrade Kalyan Trailer) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌ను గమనిస్తే.. నక్సలిజం నేపథ్యాన్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సీరియస్‌ బ్యాక్‌డ్రాప్‌కు శ్రీవిష్ణు స్టైల్‌ కామెడీ, సెటైరికల్‌ డైలాగ్స్‌ను జోడించడం సినిమాకు కొత్త ఫ్లేవర్‌ను తీసుకొచ్చింది.

ట్రైలర్‌లో అక్కడక్కడా కనిపించిన బాలయ్య రిఫరెన్సులు, పంచ్‌ డైలాగ్స్‌, శ్రీవిష్ణు టైమింగ్‌ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పాత్రను రూపొందించిన విధానం ఆయన గత చిత్రాల్లో కనిపించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ షేడ్స్‌ను గుర్తు చేస్తోంది. సీరియస్‌ అంశాన్ని పూర్తిగా సీరియస్‌గా కాకుండా.. కామెడీ, సెటైర్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో మిక్స్‌ చేయడం ‘కామ్రేడ్ కళ్యాణ్‌’లో ఆసక్తిని పెంచుతోంది.

ట్రైలర్‌ చూస్తే కథ, పాత్రలు, నేపథ్యం విషయంలో దర్శకుడు కొత్తగా ఏదో ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను ఎంతవరకు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్‌ ఫన్‌, సెటైర్‌, మాస్‌ రిఫరెన్సులతో మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


మరిన్ని వార్తలు