ఆటో ఛార్జీలను పెంచిన సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

06-10-2026 | 06:45pm

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 6(విజయక్రాంతి):మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్(Medchal Municipal Corporation) 297 వ డివిజన్ అంబేద్కర్ ఆటో స్టాండ్ ఐ.ఎన్.టి.యు.సి యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy),ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు కిలో మీటర్ కు 30 రూపాయలు ఆటో ఛార్జీలు పెంచినందుకు ఆటో యూనియన్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సంవత్సరానికి 12000 రూపాయలు ఆటో డ్రైవర్ లకు హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు.ఆటోలకు 30 రూపాయలు పెంచిన సిఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సభ్యులకు మేడ్చల్ అంబేద్కర్ కూడలి వద్ద పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ మాజి వైస్ చైర్మన్ చీర్ల రమేష్. మాజి కౌన్సిలర్ రామాన్నగారి మణికంఠ గౌడ్.బొక్క రఘుపతి రెడ్డి.ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు ఎర్ర విజయ్ రావు. వైస్ ప్రెసిడెంట్ ఓం రాజ్. ప్రధాన కార్యదర్శి నర్సింగ రావు.ఇస్మాయిల్.ఉస్మాన్.నరేష్.ఖాన్ బాయ్.హర్షత్.తదితరులు పాల్గొన్నారు..

1)మేడ్చల్ అంబేద్కర్ కూడలి వద్ద సిఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న ఆటో యూనియన్ నాయకులు...

మరిన్ని వార్తలు