సర్ ప్రక్రియకు నిరసనగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన

06-10-2026 | 07:17pm

ప్రధాన ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ దహనం 

మేడ్చల్, అక్టోబర్ 6(విజయ క్రాంతి): సర్ ప్రక్రియకు నిరసనగా ఇండియా కూటమి(INDIA Alliance) ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్(Medchal Collectorate) వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు బచావో, దేశ్ బచావో అంటూ నినాదాలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు వజ్రేస్ కుమార్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అర్హులైన ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు. అర్హులైన వారికి ఓటు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి సత్యం, సిపిఐ మాస్ లైన్ నాయకుడు సదానందం, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, నక్క సందీప్ గౌడ్, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, ఉదండపురం సత్యనారాయణ, సాయి పేట శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, ఆర్ టి ఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డి, రామన్న గారి రాఘవేందర్ గౌడ్, గోమారం బాల్ రెడ్డి, యూసుఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు