అన్నపూర్ణ దేవిగా వనదుర్గమ్మ

13-10-2026 | 02:51pm

వైభవోపేతంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఊరూరా ఘనంగా పూజలు అందుకుంటున్న దుర్గమ్మ

పాపన్నపేట: జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Devi Sharannavaratri Celebrations) వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు మంగళవారం తదియ పురస్కరించుకొని వనదుర్గామాతను అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) రూపంలో, నీలం రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నీలం రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరూరా కొలువుదీరిన అమ్మవారికి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా పూజలు జరుగుతున్నాయి.

 బుధవారం మహాచండీ దేవిగా వనదుర్గమ్మ దర్శనం

 దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన బుధవారం వనదుర్గామాత మహాచండీ (కుష్మాండ) దేవి రూపం, ఆకుపచ్చ రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.

మరిన్ని వార్తలు