18 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత
13-10-2026 | 04:42pm
మానకొండూరు, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏసిపి సతీష్ కుమార్(ACP Satish Kumar) ఆధ్వర్యంలో గ్రామంలోని వెల్ది వెంకన్నకు చెందిన మినీ మాడ్రన్ రైస్ మిల్లులో 18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విక్రయిస్తున్నాడని విశ్వసనియ సమాచారం మేరకు దాడులు జరిపి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మానకొండూరు పోలీసులకు అప్పగించారు.