సర్వకష్ఠహార సహకార చాకరిమెట్ల హనుమాన్ దర్శనం
శివంపేట్ అక్టోబర్ 6 (విజయక్రాంతి): శివంపేట మండలం, చిన్న గొట్టేముక్కల గ్రామపంచాయతీ పరిధిలోని గల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ దట్టమైన అడవి పచ్చని చెట్లతో భక్తుల(Devotees)ను పరవశిస్తూ ఆహ్లాదానికి నిలయంగా మారింది. గజ్వేల్ సంగారెడ్డి ప్రధాన రోడ్డు పక్కన వెలిసి భక్తులకు కొంగు బంగారంగా విరజిల్లుతుంది.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంగళ శనివారాల్లో భక్తులు వందల సంఖ్యలో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సత్యనారాయణ వ్రతాలను ఆచరిస్తున్నారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి రోజు పూజలు జరుగుతున్నాయి. మంగళవారం రోజున శ్రీ సహకార ఆంజనేయ స్వామి వారిని ఆలయ పూజారి ప్రభు రాజు శర్మ తన కరములొచ్చే వైభవపేత్తంగా అలంకరణ గావించి,సర్వకష్టహర సహకార హనుమాన్ దివ్య దర్శనం ను భక్తులకు కల్పించారు.