అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదు

23-11-2026 | 08:04pm
  1. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు..
  2. టిప్పర్, ట్రాక్టర్ ను ఠాణాకు తరలించి కేసు నమోదు 

పాపన్నపేట,నవంబర్23: అనుమతులు లేకుండా ఇసుక రవాణా(Sand transportation) చేస్తే కఠిన చర్యలు తప్పవని, అక్రమ ఇసుక రవాణాలను ఉపేక్షించేది లేదని ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud) హెచ్చరించారు. మెదక్ నుంచి బొడ్మట్ పల్లి వైపు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా నార్సింగి గ్రామ శివారులో ఒక ఇసుక టిప్పర్ ను.

మరో వైపు మండల పరిధి ఎన్కేపల్లి గ్రామ శివారులోని మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా అచ్చన్నపల్లి వైపు వెళ్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ ను సైతం పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న  టిప్పర్, ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మంజీరా నది, చెరువులు, కుంటల నుంచి అనుమతులు లేకుండా ఇసుక, మట్టి రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు