ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి...

26-10-2026 | 08:19pm

తాడ్వాయి (విజయక్రాంతి): ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani Program) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రజావాణిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి సమస్యపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. సోమవారం ఒకే ఒక ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. మొత్తం 22 శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉండగా, 20 శాఖల అధికారులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్వేతా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు