నీటి వృథాపై పట్టించుకోని అధికారులు!

26-10-2026 | 08:23pm

బేల,(విజయక్రాంతి): ఎలినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తున్నా, కొంతమంది గ్రామస్థులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు