ఓట్ బచావో–దేశ్ బచావో కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీనుబాబు

26-10-2026 | 08:22pm

ఓటర్ల జాబితా సవరణ, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు, చలో ఢిల్లీ కార్యక్రమాలపై కాంగ్రెస్‌ సమావేశం

మంథని, మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఖమ్మం క్లస్టర్ ఇన్‌చార్జి, రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు వేగి వెంకటేష్‌తో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఓట్ బచావో–దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు, చలో ఢిల్లీ కార్యక్రమాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

అలాగే వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగంపై చూపుతున్న ప్రభావాన్ని సమీక్షించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్ల నమోదు వంటి అంశాలపై పార్టీ శ్రేణులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు