గణపతి లడ్డును దక్కించుకున్న రిపోర్టర్
శివంపేట్ అక్టోబర్ 6 (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) శివ్వంపేట మండల కేంద్రంలోని కింగ్స్ యూత్ పిఎంజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డును రిపోర్టర్ నటరాజ్ గౌడ్ ఐదవ సారి కైవసం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం గణేశునికి ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి గణపతి లడ్డును తీసుకోవడం అదృష్టమని అన్నారు. నాలుగుసార్లు గౌడ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశుని వద్ద లడ్డూను కైవసం చేసుకున్నారు.
ఈసారి కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లడ్డూను కైవసం చేసుకున్నారు. గణపతి లడ్డును కైవసం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. గణేష్ ని లడ్డును ప్రతి సంవత్సరం కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు త్రినేష్ గౌడ్, మధు,కింగ్స్ యూత్ సభ్యులు అజయ్, మల్లేష్, అంజి, శ్రీచేరాన్,భారత్, రాకేష్, మాలికార్జున్, విక్రమ్, నితిన్, మగ్దము, మగ్గం పాల్గొన్నారు.