రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు ఎంపిక..

29-09-2026 | 03:04pm

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): కాసిపేట గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్(Athletic Association) ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో  జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ( NIDJAM & MDAA ) పోటీలు జరిగాయి. ఈ  పోటీల్లో కాసిపేట తెలంగాణ సాoఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు టి. సిద్దార్థ , ట్రయత్లాన్ ఎ,  బి. రాకేష్   పెంటతల్లాన్ లో అత్యంత ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లుగా ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ మంగళవారం తెలిపారు.

తమ  పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కూడా ఇదే క్రీడాస్ఫూర్తితో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీ డీ కె. హరిష్ , పీఈటీ ఎ. రాజేందర్, విద్యార్థులు క్రీడాకారులను అభినందించారు.

మరిన్ని వార్తలు