ఓఆర్‌ఆర్ కేంద్రంగా ‘నకిలీ’ దందా

29-09-2026 | 05:20am

రైతుల నోట్లో మట్టి కొడుతున్న కేటుగాళ్లు

పెద్ద అంబర్‌పేట, కుంట్లూరుట్‌లో గుట్టురట్టు.. రూ.30 లక్షల నకిలీ ఎరువులు స్వాధీనం

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) (ఓఆర్‌ఆర్) పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకుని కొం దరు అక్రమ వ్యాపారులు నకిలీ ఎరువుల(Illegal traders fake fertilizers) దందాను జోరుగా సాగిస్తున్నారు. రైతుల అ వసరాన్ని ఆసరాగా చేసుకుని నాసిరకం ప దార్థాలను అసలైన కంపెనీల బస్తాల్లో నింపి మార్కెట్లోకి తరలిస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

కుంట్లూరులో వ్యవసాయ శాఖ(Department of Agriculture), పోలీసు అధికారులు నిర్వహించిన సం యుక్త దాడుల్లో సుమారు రూ. 30 లక్షల విలువైన నకిలీ పొటాషియమ్, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రూ. 2 కోట్ల విలువైన నకిలీ ఎరువులు పట్టుబడిన ప్రాంతంలోనే మళ్లీ ఈ తరహా దందా బయటపడటంతో వ్యవసాయ శాఖ పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 ఉప్పుకు రంగు పూసి.. బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి..

గతంలో పెద్ద అంబర్పేట్లో సాగిన దందా తీరులోనే ప్రస్తుతం కుంట్లూరులో నూ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఉప్పుకు ఎరుపు, బూడిద రంగులు కలిపి యంత్రాల్లో మిక్సింగ్ చేసి, గ్రోమోర్, ఐపీఎల్ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్), కోరమాండల్ వంటి ప్రముఖ కంపెనీల పే రుతో ఉన్న నకిలీ బస్తాల్లో నింపి రైతులకు అంటగడుతున్నారు.

కుంట్లూరు గోదాములపై దాడులుతాజాగా వచ్చిన సమాచారం తో అధికారులు కుంట్లూరు ఉషోదయ కాలనీలోని ప్లాట్ నంబర్ 43 లో ఉన్న ఓ భారీ గోడౌన్ తాళాలు పగలగొట్టి తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లోఐపీఎల్ ఎంవోపీ బస్తా లు 302,తెల్లని పాలిష్ ఉప్పు బస్తాలు 683,నకిలీ డీఏపీ, కాంప్లెక్స్ బస్తాలు 218 తో పాటు అనుమానాస్పద గ్రాన్యూల్స్ బస్తాల ను 2,086 (బూడిద రంగు) అధికారులుస్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కృష్ణ కిశోర్, రవి, మణి నాయక్ అనే వ్యక్తు లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.

అధికారుల నిద్రమత్తు..... 

అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ల పేర్లు, ప్రధాని మోడీ ఫోటోలతో(Prime Minister Modi's photo) ఉన్న నకిలీ బస్తాలను తయారు చేసి ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్కు తరలిస్తున్నా వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రూ. 2 కోట్ల విలువైన సరుకు పట్టుబడినప్పుడు నమోదైన కేసులు, తీసుకున్న చర్యలపై స్పష్టత లేకపోవడం వల్లే కేటుగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

కాగా, ఈ వరుస ఘటనలపై వివరణ కోరేందుకు మండల వ్యవసాయ అధికారికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. అక్రమ తయారీ కేంద్రాలు, సరఫరాదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.

మరిన్ని వార్తలు