ఉక్కుద్రవం లీక్.. తప్పిన ముప్పు

29-09-2026 | 04:07pm

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakhapatnam Steel Plant)లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-1లోని సీసీడీ విభాగంలో లాడిల్ స్లైడ్ గేట్ సరిగా మూసుకోకపోవడంతో అందులో ఉన్న ఉక్కుద్రవం(Liquid steel) ఒక్కసారిగా నేలపైకి ప్రవహించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమయ్యారు. ఉక్కుద్రవం నేలపైకి రావడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ప్రాంతంలో సుమారు రెండు నెలల క్రితం లాడిల్ బ్లాస్టర్ ఘటన చోటుచేసుకుని పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తాజా ఘటనతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా చర్యలపై మరోసారి చర్చ మొదలైంది.

మరిన్ని వార్తలు