గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామసభ

29-09-2026 | 04:30pm

బోథ్. సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) గ్రామ సమస్యల పరిష్కారానిక గ్రామసభలు ఉపకరిస్తాయని ప్రతి వార్డు సభ్యులు తప్పనిసరిగా సమావేశాలలో సమస్యలను చర్చించాలని కరత్వాడ గ్రామ సర్పంచ్ విశ్వేశ్వర్(Village Sarpanch Visweshwar) పేర్కొన్నారు. మంగళవారం కరత్వాడ గ్రామపంచాయతీ లో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సమస్యలను సమదృష్టి కి తీసుకు వచ్చినట్లయితే దశలవారీగా పరిష్కరించే ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ త్యాగాల గంగారాని పంచాయతీ కార్యదర్శి సమ్రిన్ సుల్తానా, వార్డు సభ్యులు భీమ లింగు ,సిడం భీమ్రావు, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు