ప్రపంచ హార్ట్ దినోత్సవ ర్యాలీ
హృదయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 29(విజయక్రాంతి):ప్రపంచ హార్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడిసిటీ ఆసుపత్రి(medicity hospital) వైద్యుల ఆధ్వర్యంలో ఘనపూర్ లో హృదయ ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఘనపూర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఘనపూర్ మున్సిపల్ కౌన్సిలర్ నునావత్ పార్వతి తార్య నాయక్ మాట్లాడుతూ నేటి జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు.ప్రతి రోజూ కొంత సమయం వ్యాయామం చేయడం,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం,పొగత్రాగడం ఇతర అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం తో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆమే తెలిపారు.
అంతేకాకుండా ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.అనంతరం కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఇనాక్షి మాట్లాడుతూ ఆరోగ్యమే ప్రతి వ్యక్తికి ప్రధాన సంపదని ఆమే స్పష్టం చేశారు.గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి వెంటనే వైద్య సహాయం పొందడం చాలా అవసరమని ఆమే తెలిపారు.
యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రతిరోజు శారీరక వ్యాయామం సమతుల్య ఆహారం,ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని డాక్టర్ ఇనాక్షి సూచించారు.ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్ పవన్ శర్మ.డాక్టర్ సమీర్.అంజలి.ఐశ్వర్య.స్వప్న.తో పాటు మార్కేటింగ్ మేనేజర్ కుమారస్వామి.సంజయ్.నాగార్జున.రాజు.చేరాలు.సాయికుమార్.బాలకృష్ణ.అధిషేక.కవిత.మల్లికార్జున్.మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు...
1) ప్రపంచ హార్ట్ దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు...