దీపావళి నాటికి మినీ స్టేడియం, ఆడిటోరియం సిద్ధం చేయాలి
పనులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో(Municipality limits) నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియం, ఆడిటోరియం పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (District Collector Rahul Sharma)మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
మినీ స్టేడియంలోని ఇండోర్ సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ రెండు బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు టేబుల్ టెన్నిస్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడలకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. క్రీడాకారుల కోసం డ్రెస్సింగ్ రూమ్‌లు, స్టోర్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఆడిటోరియంలో స్టేజి, లైటింగ్, వాల్ ప్యానెలింగ్, ఫ్యాన్లు, సౌండ్ సిస్టమ్ వైరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తాత్కాలిక సౌండ్ సిస్టమ్‌కు బదులుగా నాణ్యమైన శాశ్వత సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీపావళి నాటికి మినీ స్టేడియం, ఆడిటోరియంను అన్ని హంగులతో సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం స్థానిక భూ సమస్యలపై వచ్చిన వినతులను పరిశీలించిన కలెక్టర్, రెవెన్యూ రికార్డులను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.