వివాహిత అనుమానస్పద మృతి

06-10-2026 | 09:22pm

కుభీర్, అక్టోబర్ 06: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని న్యూ సాంవ్లీ గ్రామానికి చెందిన మలుపు సుశీల   (27) అనే వివాహిత తన ఇంటి ముందర గల షెడ్ లో మృతి చెంది ఉందని కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించినట్లు కుభీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి(Kubheer SI A. Krishna Reddy) తెలిపారు. మృతురాలికి 10  సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుశీలను తరచూ భర్త ,అత్త మామ వేధింపులకు గురిచేసేవారని ఆమె మృతికి వారు ముగ్గురు బాద్యులని  మృతిపై అనుమానం ఉందని  మృతురాలి తల్లి  మాలేపు సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై వివరించారు.

మరిన్ని వార్తలు