అమరులు కోరుకున్న సమాజం నిర్మించటమే మనమిచ్చే సరైన నివాళి

06-10-2026 | 09:37pm

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

చందుర్తి,అక్టోబర్ 06,(విజయక్రాంతి) :చందుర్తి మండలంలోని సనుగుల గ్రామంలో తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈడుగు శంకర్ అమరుల యాది కార్యక్రమంలో పాల్గొన్నారు. త్యాగాలకు మారుపేరు అయిన సనుగుల నేల తల్లికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ అయన పోరాటాన్ నిగుర్తుచేస్తూ కవిత తన ప్రసంగాన్ని ప్రారంభించారు.ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నాకు మళ్లీ తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.

అమరులను యాది చేసుకుంటున్న ఈ సందర్భంలో వాళ్ల త్యాగాల ఫలితాలు నిజంగా మనకు అందాయా, వచ్చిన తెలంగాణలో ఫలితాలు ఎవరికీ వచ్చాయన్నది పున సమీక్ష చేసుకోవాలని అన్నారు.ఒకప్పుడు అన్నలు ప్రాణాత్యాగాలు చేస్తే.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ప్రాణాలను  త్యాగాలు చేశారని, ఆనాడు ఈ ప్రాంతంలో ముగ్గురు అన్నలు షెల్టర్ తీసుకుంటే ఆ ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టి వాళ్లను సజీవ దహనం చేశారని నలుగురు పిల్లలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు . కానీ ఇప్పటికీ కూడా ఆ ఏడుగురిని పొట్టన పెట్టుకున్న వాళ్లపై చర్యలు లేవని అన్నారు.

వారి త్యాగాలకు సరైన నివాళి అంటే వాళ్లు కోరుకున్న సమాజాన్ని నిర్మించటమే సబ్బండ కులాలు, వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం దొరికినప్పుడే ఆ త్యాగాలకు అర్థం ఉంటుంది. ఆనాడు దొరలు, భూస్వాములు, దోపిడీ దారుల మీద మనం కొట్లాడాం. ఇప్పుడు అధికారంలో ఉండి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ల మీద కొట్లాడుతున్నాం. దోపిడీ దారులు, దొరలు, భూస్వాముల దోపిడీ విధానం మారుతుందే తప్ప వారి స్వభావం మారదు.

ఆ స్వభావం మారాలంటే మనమంతా నిరంతరం కొట్లాడుతూనే ఉండాలని అడిగేవాడు లేకపోతే మార్పు రాదన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై మేము ప్రశ్నిస్తేనే ప్రభుత్వం రూ. 11 కోట్లు విడుదల చేసిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం,కానీ సామాజిక తెలంగాణ రాలేదని అన్నారు. ఇప్పటికీ పేదోడీకి విద్య, వైద్యం అందటం లేదంటే ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. సబ్బండ వర్గాల వాళ్లు గ్రీన్ పెన్ పట్టుకోని చట్టాలు చేసినప్పుడే మార్పు వస్తుందని అన్నారు.

ఈ ప్రాంతంలో ఒక్క రిజర్వాయర్ కట్టుకుంటే వేములవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాలకు నీళ్లు వస్తాయని, కానీ తెలంగాణ వచ్చాక 13 ఏళ్లు అయిన ఇంకా దాన్ని నిర్మించటం లేదని ప్రశ్నించారు. అందుకే మేము భూలక్ష్మి పథకం ద్వారా పేదోళ్లకు ఎకరం భూమి ఇవ్వాలనే ఆలోచన చేశామని, ప్రతిపక్ష పార్టీలు ఇది సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నాయని అన్నారు.

భూ పంపిణీ జరగాలంటే రాజకీయ పంథాలో పోరాటం చేయాలి కోరారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి తమకు కావాల్సిన అంశాలపై పోరాటం చేస్తేనే మార్పు వస్తుందని, మా పార్టీ తరఫున అమరులు, మాజీ మావోయిస్టులకు మేలు జరిగేలా పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ మావోయిస్టుల కోసం ప్రజా ఉద్యమకారుల విభాగం అని పెట్టామని, అమరుల త్యాగాలకు ఫలితాలు వచ్చే విధంగా మనందరం నిజమైన పోరాటం చేయాల్సి ఉందని కవిత అన్నారు.

మరిన్ని వార్తలు