నర్సింగ్ విద్యార్థినులకు భరోసానిచ్చిన భరోసా టీం

06-10-2026 | 09:33pm

కొత్తగూడెం అక్టోబర్ 6 విజయ క్రాంతి: భద్రాద్రి కోతగూడెం  జిల్లా లోని భరోసా టీమ్(Bhadradri Kothagudem Bharosa Team)  లక్ష్మీదేవిపల్లి  సిద్ధార్థ నర్సింగ్ కళాశాలలో, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.భరోసా ఇన్‌చార్జ్ ఎస్సై  చల్లా అరుణ , ఈ కార్యక్రమంలో పాల్గోని  పలు అంశాలపై అవగాహన కల్పించారు.

భరోసా సెంటర్ ద్వారా అందించబడుతున్న సేవలు, పోక్సో చట్టం గురించి వివరాలు,సోషల్ మీడియా / మొబైల్ ఫోన్ వినియోగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ప్రాముఖ్యత,ఫిలిప్ క్రిస్టల్ పద్ధతి,టి.సేఫ్ యాప్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భరోసా ఇన్‌చార్జ్ చల్లా అరుణా,కౌన్సిలర్ సుమలత, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, కాలేజీ యజమాన్యం ,విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు