ఏకాదశి లక్ష పుష్పార్చన...
- క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ.....
- భక్తులు దాతలు యాదగిరిగుట్ట అధికారిక వెబ్ సైట్ https://yadagiriguttatemple.telangana.gov.in ను ఉపయోగించుకోండి.....కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్....
- యాదగిరిగుట్ట, అక్టోబర్ (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy) వారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. మంగళవారం ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు.
- పాంచరాత్రాగమానుసారంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు. కొండపైన పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి ఆకు పూజ మహోత్సవమును అర్చకులు వైభవంగా నిర్వహించారు.నకిలీ వెబ్‌సైట్లపై భక్తులు, దాతలు అప్రమత్తంగా ఉండాలని యాదగిరిగుట్ట అధికారిక వెబ్ సైట్ ను https://yadagiriguttatemple.telangana.gov.in ను మాత్రమే వినియోగించుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్మాణాధికారి భవాని శంకర్ తెలిపారు. మంగళవారం కొండపైన ఈవో భవాని శంకర్ మాట్లాడుతూ
యాదగిరిగుట్ట దేవస్థానం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా వై టి డి,యాదాద్రి, యాదగిరిగుట్ట (YTD Yadadri, Yadagirigutta) తదితర పేర్లతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు/సంస్థలు అనధికారికంగా వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం దృష్టికి వచ్చిందని ,ఇలాంటి వెబ్‌సైట్ల ద్వారా భక్తులకు తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే సమాచారం అందించడంతో పాటు, దర్శనం, సేవలు, పూజలు, వసతి, విరాళాలు, ఆన్‌లైన్ బుకింగ్‌లు తదితర సేవల పేరుతో భక్తులను మోసపూరిత లావాదేవీలకు గురిచేసే అవకాశం ఉందని ఇప్పటికే దేవస్థానం పేరును,
గుర్తింపును పోలి ఉండే కొన్ని అనధికారిక వెబ్‌సైట్లను అధికారులు గుర్తించారని,సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట దేవస్థానం సేవలను పొందేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలి ఇతర ప్రైవేట్ లేదా అనధికారిక వెబ్‌సైట్లలో సమాచారఎటువంటి చెల్లింపులు చేయవద్దు ని అన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం వెబ్ సైట్ ను మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు.