మొన్న బీజేపీ.. నిన్న బీఆర్‌ఎస్‌

12-09-2026 | 02:02pm

పీసీసీ అధికార ప్రతినిధి లోకేష్‌ యాదవ్‌

మహబూబ్‌నగర్ అర్బన్ : బీఆర్‌ఎస్‌ నాయకులు దళితులు, బడుగు బలహీన వర్గాల పట్ల అగౌరవంగా వ్యవహరించడం సరికాదని పీసీసీ అధికార ప్రతినిధి లోకేష్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మాతృమూర్తిని దూషించిన తీరును ఖండించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడి అనంతరం పసుపు నీళ్లతో ఫామ్‌హౌస్‌ను శుద్ధి చేయడం దళితులను అవమానించడమేనని విమర్శించారు.

ఇంతకుముందు బిజెపి ఇటీవల బీఆర్ఎస్ ఎవరిని పడితే వారిని దూషించడమే లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదన్నారు.   తెలంగాణ ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫామ్‌హౌస్‌లో ఉండటం సరికాదన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఓబేదుల్లా కొత్వాల్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌, సత్తూరి చంద్రకుమార్‌ గౌడ్‌, బెక్కరి మధు, జహీర్‌ అక్తర్‌, మురళి గౌడ్‌, రాములు యాదవ్‌, యూత్‌ కాంగ్రెస్‌ అవీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు