పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
12-09-2026 | 05:43pm
దేవరకద్ర, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): SIR-2026 ప్రత్యేక ప్రచార దినం సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ కౌకుంట్ల, సీసీకుంట, దేవరకద్ర మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను సమీక్షించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాబితా సవరణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు.