పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

12-09-2026 | 07:17pm

బెజ్జంకి,(విజయక్రాంతి): ప్రత్యేక సవరణ కార్యక్రమం(Special Intensive Revision)లో భాగంగా కరీంనగర్ అదనపు కలెక్టర్, మనకొండూరు నియోజకవర్గ(Manakondur Constituency) ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంతోపాటు  తోటపల్లిలో 241, 242, 243 నంబర్ల పోలింగ్ కేంద్రాలను(polling stations) తహసిల్దార్ శ్రీకాంత్ తో కలిసి సర్ ప్రక్రియను సందర్శించి పరిశీలించారు. ఓటర్ల వివరాల సవరణ, నమోదు ప్రక్రియతో పాటు పోలింగ్ కేంద్రాల్లో చేపడుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు