తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక
మెట్రో, బస్సు జర్నీ ఇక తక్కువ ధరకే.. నవంబర్ 8 నుంచి కొత్త రేట్లు!
రూ.8,500 పాస్ ఇప్పుడు రూ.4,000కే.. రేవంత్ సర్కార్ దీపావళి గిఫ్ట్!
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను తెలంగాణ ప్రభుత్వం భారీగా తగ్గించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు Public Transport సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ వివరాలను ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పోస్టు చేశారు.
Daily Pass ధర రూ.275కు తగ్గింపు
ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ Metro–RTC Combined Pass ధరను రూ.275కు తగ్గించారు. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీ బస్సుల కోసం రూ.75 కేటాయించారు. ఈ పాస్ ద్వారా రోజుకు గరిష్ఠంగా నాలుగు Single Journeys చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125 మేర ఆదా కానుంది.
Monthly Passపై రూ.4,500 సేవింగ్స్
నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలోనూ ప్రభుత్వం భారీ మార్పు చేసింది. ఇప్పటివరకు రూ.8,500గా ఉన్న Monthly Passను ఇకపై రూ.4,000కే అందించనున్నారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్తో నెలకు గరిష్ఠంగా 50 Single Trips మెట్రోలో చేసుకోవచ్చు. అయితే RTC Busesలో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు ఉండవు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ పాస్ తీసుకునే వారికి ప్రతి నెలా రూ.4,500 ఆదా అవుతుంది. రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125 మేర ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, నిత్యం మెట్రో–బస్సులపై ఆధారపడే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఊరటనివ్వనుంది.
నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి
ప్రభుత్వం ప్రకటించిన Revised Pass Rates నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ధరలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, సామాన్యులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.