ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా ఐదు లక్షల బీమా

27-11-2026 | 04:23pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 27 (విజయ క్రాంతి):మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో(Dharmareddi Village) ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Family Life Insurance Scheme) కార్యక్రమం గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు భీమా వర్తిస్తుందనీ,పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం, కుటుంబాన్నీ పోషించే సంపాదించే వ్యక్తికి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించుటకు ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం ఏర్పాటు చేశారు.

ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ జయరాజ్, పంచాయతీ కార్యదర్శి రమేష్,వివోఏ అంజమ్మ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు