లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోండి

06-10-2026 | 11:19pm

కాగజ్‌నగర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్(Lifeline Express) వైద్య సేవలను సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ను డీఎంహెచ్‌ఓ డా. సిడాం నాగేంద్రతో కలిసి ఆయన పరిశీలించారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు 20 రోజుల పాటు ఉచిత వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కంటి ఆపరేషన్లు, పిల్లలకు ఎముకల శస్త్రచికిత్సలు, చెవి–ముక్కు–గొంతు, ప్లాస్టిక్ సర్జరీ, దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ నిర్వాహకులు డా. మనోహర్‌రెడ్డి, యోగేష్, నాయకులు వీరభద్రచారి, హనుమంతరావు, అరుణ్‌కుమార్ లోయా, పెద్ది హరీష్, సాయికుమార్, పవన్ బల్దేవా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు