రైతులకు శాస్త్రీయ సాగుపై అవగాహన

30-10-2026 | 06:50pm

పెంచికలపేట, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఎల్కపల్లి రైతువేదికలో GRK రైతు సేవ అండ్ మార్కెట్ లింక్ గ్రూప్(GRK Farmer Services and Market Link Group) ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మధుకర్ మాట్లాడుతూ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ, వరిలో కాండం తొలిచే పురుగు నియంత్రణ చర్యలను వివరించారు.

యాసంగిలో నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలు సాగు చేయాలని, పత్తి కట్టెను తగలబెట్టకుండా భూమిలో కలియదున్ని భూసారం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామచందర్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీవిద్య, వంశీ, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు