సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రహదారులపై నీటి ప్రవాహం
- ప్రమాదాల నివారణకు రహదారులను మూసివేసిన పోలీసులు
- ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా పోలీసులకు సహకరించాలని సూచన
సత్తుపల్లి. నవంబర్ 4. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి పోలీస్ స్టేషన్(Sattupalli Police Station) పరిధిలోని మూడు రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు ఆయా రహదారులను మూసివేశారు.
1. సత్తుపల్లి పట్టణంలోని సిద్ధారం రోడ్డులో ఎం.ఆర్. గార్డెన్ సమీపంలో.
2. కిష్టారం నుంచి యాతాలకుంట వెళ్లే రహదారిపై.
3. రుద్రాక్షపల్లి నుంచి నాచారం వెళ్లే రహదారిపై.
ఈ రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు నీటి ఉధృతిని తక్కువగా అంచనా వేసి రహదారులను దాటేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు సూచించారు. తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు ప్రజలు సహకరించాలని సత్తుపల్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు.