దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్ , నవంబర్ 04 (విజయ క్రాంతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులను నమ్మి మోసపోవద్ద ని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల సింగిల్ విండో ఆధ్వర్యంలో సుద్దాల, అల్లిపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయి సాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్లు అనేడి భాస్కర్ రెడ్డి, చిలుక సతీష్, సర్పంచులు ఒజ్జా సంపత్ యాదవ్, కోదాటి సాయి కిరణ్, నాయకులు. అనంత రెడ్డి, దామోదర్ రావు, రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, సంపత్, సీఈవో సతీష్, పిఎసిఎస్ పాలకవర్గ సభ్యులు, రైతులు, తదితరులున్నారు.